subhodayam.news
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 9:57 am Digital Edition : Narendhar

బాల్కొండ పద్మశాలి సంఘం లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

బాల్కొండ  : కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలో మార్కండేయ మందిరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు అందే వెంకటగిరి అధ్యక్షులు ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సమాజ సేవ, తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషిని స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు భూస రత్నాకర్, మేక నాగేశ్,కుందారపు శ్రీనివాస్ , జక్కుల రాజు,తాళ్ల బిష్మచారి,బీమర్తి నారాయణ,బోగ చిన్న భూమేశ్వర్,మైసరి పెద్ద గంగాధర్, చిన్నగంగాధర్,మామిడాల రాజు,బోగ సత్యనారాయణ,బుస శ్రీహరి, ఎక్కాలదేవి సురేష్,మైసరి సృజన్,మేక సతీష్ పొన్న రాజ నారాయణ,బీజ్జా శ్రీనివాస్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.