ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
వెల్గటూర్ లో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేత మెండోరా: మండలంలోని వెల్గటూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు సోమ్ రాజేందర్, సర్పంచ్ కావ్య సతీష్, మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బద్దం శ్రీనివాస్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘ అంజయ్య పాల్గొన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్‌ఎఫ్ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజరత్నం, సుమన్, సలీం, భూమేశ్వర్, మైపాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.