ఉల్లాస్ పరీక్షకు మహిళల్లో విశేష స్పందన
మెండోరా: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలంలో ఆదివారం ఉల్లాస్ (ఉల్లాస్-ఎఫ్ ఎల్ఎన్ఏటి) పరీక్షను తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. డీఆర్‌డీఏ (సెర్ప్), వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షకు మండలంలోని 450 మంది సంఘ సభ్యులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను ఎంపీడీఓ లక్ష్మణ్, ఏపీఎం గంగరాజు సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అభ్యాసకులతో మాట్లాడి పరీక్షకు చేసిన ఏర్పాట్లు, వారికి కల్పించిన సౌకర్యాలు, పరీక్ష నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. మహిళలు ఉత్సాహంగా పరీక్షకు హాజరై తమ స్పందనను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో తొమ్మిది పరీక్షా కేంద్రాల పరిధిలోని సర్పంచులు, ఏపీఎం, సెర్ప్ సీసీలు, గ్రామ సంఘాల అధ్యక్షులు,...