గోవింద్ పేట్ ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్టు దినోత్సవ వేడుకలు…

ఆర్మూర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గోవింద్ పేట్ లో ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా జిల్లా ఫార్మసీ అధికారి నారాయణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గోవింద్ పేట్ ఫార్మసీ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మణ్ ను స్థానిక వైద్యాధికారి డాక్టర్ మానస ఘనంగా సన్మానించారు.వీరు అందించిన సేవలను వైద్యాధికారి కొనియాడారు. రోగుల కోలుకోలేని పరిస్థితిలో ఫార్మసీ ఆఫీసర్ యొక్క పాత్ర చాలా కీలకమైనది. ప్రతీ ఒక్క రోగిని పలకరిస్తూ నవ్వుతూ మందులు అందజేసి వారి యొక్క జబ్బులు నయం చేయడంలో వీరి పాత్ర చాలా కీలకమని వైద్యాధికారి కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్,నర్సింగ్ ఆఫీసర్లు నళిని దేవి, సంధ్య ల్యాబ్ టెక్నీషియన్...