ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ లోని విజ్ఞ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.అన్నదాన కార్యక్రమంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ముఖ్య అతిథిగా హాజరైన 3వ వార్డు కౌన్సిలర్ యామాద్రి కవితా భాస్కర్ ను గణేష్ మండప నిర్వహకులు మర్యాదపూర్వకంగా సత్కరించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ యామాద్రి కవిత భాస్కర్ మాట్లాడుతూ 3వ వార్డులోని సమస్యలను పరిష్కరిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ కమిటీ అధ్యక్షులు రామోజీ దశరథ్,హౌసింగ్ బోర్డ్ 6వతర్ప పద్మశాలి సంఘం అధ్యక్షులు కురికెల్లి ఆత్మ చరణ్,విజ్ఞ యూత్ సభ్యులు రాస ఆనంద్,జిట్ట మారుతి కుందవరపు శ్రీను, గుజ్జేటి నర్సయ్య,జల్ద శ్రీనివాస్,రమేష్,మ్యాక హరిప్రసాద్, చింత మనోజ్,అతిథులుగా పాల్గొన్న పిప్రికర్ పుష్పాకర్,వేముల ప్రకాష్,హౌసింగ్ బోర్డ్ కమిటీ అధ్యక్షులు రామోజీ దశరథ్,పద్మశాలి సంఘ అధ్యక్షులు ఆత్మచరణ్ లను విజ్ఞ యూత్ సభ్యులు శాలువలతో ఘనంగా సన్మానించి,వారి సహాయ,సహకారాలను అభినందించారు.