subhodayam.news
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 6:43 pm Digital Edition : Narendhar

సైకిల్ యాత్రను జయప్రదం చేయండి

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆఫీసులో కిషన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈనెల 27వ తారీఖు నాడు ఆదివారం ఉదయం పది గంటలకు బోధన్ పట్టణం నుండి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర మొత్తం నిజాంబాద్ పార్లమెంటులో 180 గ్రామాలు 33 మండలాలు 10 రోజులపాటు ఈ యొక్క సైకిల్ యాత్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్తో రైతులను చేతనవంతం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలని భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు పాటుకూరి తిరుపతి రెడ్డి  ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. ఈ యొక్క విలేకరుల సమావేశంలో స్థానిక బిజెపి మండల అధ్యక్షులు నవీన్  బిజెపి కిషోర్ మోర్చా మండల అధ్యక్షులు నరసయ్య  బిజెపి కిషన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు టి చిన్నయ్య తదితర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.