బాల్కొండ కాలేజీలో గోవిజ్ఞాన పరీక్షల పుస్తకాల వితరణ
బాల్కొండ :మన గోవులు, మన సంస్కృతి మరియు మన భవిష్యత్తు పట్ల సమాజంలో జ్ఞానం, అవగాహన, సేవా దృక్పథాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా “గో సేవా విభాగము – తెలంగాణ” ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గో విజ్ఞాన పరీక్షలకు అపూర్వ స్పందన లభిస్తోందని బాల్కొండ ఖండ్ గో సేవా ప్రముఖ్ సల్ల నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా బాల్కొండ లోని ప్రభుత్వ కళాశాలల్లో గో విజ్ఞాన పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు లెక్చరర్లు పాల్గొన్నారు.