బాల్కొండ : గణేష్ నవరాత్రుల ముగింపు ను పురస్కరించుకొని లోకకళ్యాణం కోసం, భక్తుల మనోభీష్ట సిద్ధి కోసం బాల్కొండ మండల కేంద్రంలోని దాస్ ఆంజనేయ ఆలయంలో బుధవారం గణపతి హోమము, యజ్ఞం కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక సేవకులు ఠాగూర్ బలరాం సింగ్, మాలెం సాయన్న ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఠాకూర్ రాము, తోట చిన్నయ్య, పాపయ్య, కమ్మరి రాజేశ్వర్, శ్రీకాంత్, రాకేష్ లు హోమయజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ప్రతి ఏటా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.