తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర అజరామరం …

ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ లో గల స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద 14 వ వర్దంతి సందర్భంగా పూలలు వేసి ఘన నివాళులర్పించిన తర్వాత పద్మశాలి ముద్దుబిడ్డ ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి-రఘు మాట్లాడుతూ తెలంగాణ తొలి,మలి దశ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన నిఖార్సైన నాయకుడు,నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన మహాయోధుడు,97 ఏళ్ళతో ఎముకలు కొరికే చలిలో ఉద్యమాన్ని నడిపిన స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ అమరుడని కొనియాడారు.ఆర్మూర్ పట్టణంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 14 వ వర్ధంతి సందర్భంగా వివిధ తర్పల పద్మశాలి కుల బాంధవులు ఆయన...