subhodayam.news
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 5:00 pm Digital Edition : Jindham Narahari

తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర అజరామరం …

ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ లో గల స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద 14 వ వర్దంతి సందర్భంగా పూలలు వేసి ఘన నివాళులర్పించిన తర్వాత పద్మశాలి ముద్దుబిడ్డ ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి-రఘు మాట్లాడుతూ తెలంగాణ తొలి,మలి దశ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన నిఖార్సైన నాయకుడు,నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన మహాయోధుడు,97 ఏళ్ళతో ఎముకలు కొరికే చలిలో ఉద్యమాన్ని నడిపిన స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ అమరుడని కొనియాడారు.ఆర్మూర్ పట్టణంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 14 వ వర్ధంతి సందర్భంగా వివిధ తర్పల పద్మశాలి కుల బాంధవులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి-రఘు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఆయన చేసిన ప్రజా ఉద్యమాలు ఎప్పటికీ మర్చిపోలేనివన్నారు.బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారని, మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు మనమందరం కృషి చేసినప్పుడే ఆయనకు మనం అర్పించిన నిజమైన నివాళి అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోనె దామోదర్,ఆర్మూర్ పట్టణంలోని 5,6 తర్పల అధ్యక్షులు ఆడెపు ప్రభాకర్,కురికెల్లి ఆత్మ చరణ్ పద్మశాలి సంఘ సభ్యులు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.