subhodayam.news
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 8:07 pm Digital Edition : Jindham Narahari

బాపూజీ ఆశయాల స్ఫూర్తితో సేవా కార్యక్రమం… పేదలకు పండ్ల పంపిణీ…

ఆర్మూర్: ప్రజ్ఞా పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తున్న బ్రహ్మదండి శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు,స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ నిరుపేదలకు అరటిపండ్లు పంపిణీ చేయడం జరిగింది.సమాజంలో అవసరం ఉన్న వారికి మా వంతు సహాయం అందించడం ద్వారా బాపూజీ చూపిన సేవా స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించాము.“మహనీయుల ఆశయాలను గుర్తు చేసుకోవడమే కాదు… వారి స్ఫూర్తితో సమాజానికి సేవ చేయడమే నిజమైన నివాళి.”