బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో గత 36 ఏళ్లుగా విద్యారంగానికి విశిష్ట సేవలందిస్తున్న శ్రీ వెంకటేశ్వర హై స్కూల్, మదర్ థెరిసా హై స్కూల్ డైరెక్టర్ కెవి సుబ్బారెడ్డి సార్ కు బెస్ట్ టీచర్ అవార్డు లభించింది. ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ బ్రిక్స్ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సంస్థ నాయకులు ఈ అవార్డును అందించారు. సుబ్బారెడ్డి తో పాటు మండలంలోని పలు పాఠశాల ల ఉపాధ్యాయులకు ఈ అవార్డులు లభించాయి. కార్యక్రమం అసోసియేషన్ నాయకులు షఫీ తదితరులు పాల్గొన్నారు.