subhodayam.news
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 8:00 am Digital Edition : Jindham Narahari

ఆర్మూర్ లో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు “అవ్వకు బువ్వ” ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమం…

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని జిరాయత్ నగర్ లో గల విద్యా హైస్కూల్ ఆవరణలో ప్రతీ నెలలో పంపిణీ చూసే ఉచిత బియ్యం పంపిణీ “అవ్వకు బువ్వ” కార్యక్రమంలో భాగంగా దాదాపు 58 మంది నిరుపేద వృద్ధులకు 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేశ్,ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పవార్,ఉపాధ్యక్షులు జింధం నరహరి లు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ నిరుపేదలైన వృద్ధులకు “అవ్వకు బువ్వ” కార్యక్రమం ద్వారా ప్రతీ నెల 5 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.

రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలతో సమాజంలో అట్టడుగున గల ప్రజానీకానికి ఏదో ఒక సేవ చేయాలనే తపనతో ముందుకెళ్తూ మొక్కలు నాటే కార్యక్రమం, చలికాలంలో దుప్పట్లు పంచే కార్యక్రమం,ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థికంగా సహాయం చేయడం,వైద్య శిబిరాలు నిర్వహించడం, వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల గుండెచప్పుడుగా రక్షణ కవచంగా రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూర్ పట్టణంలో అగ్రగామిగా నిలుస్తుంది…అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎస్.జీ.శ్రీకాంత్,కార్యనిర్వక కార్యదర్శులు ఖాందేశ్ సత్యం,తులసీ పట్వారి,డాక్టర్ బేతు గంగాధర్,కార్యవర్గ సభ్యులు ఖోడె శ్రీనివాస్,మక్కల సాయినాథ్,గోక శరత్,సదుమస్తుల విష్ణు,సంజీవ్,సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.