subhodayam.news
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 3:27 pm Digital Edition : Narendhar

ఆప్షనే లేనప్పుడు.. అనర్హులెలా?

ఆప్షనే లేనప్పుడు.. అనర్హులెలా?

రెండు పడక గదుల ఇళ్ల జాబితాపై అభ్యంతరాలు

బాల్కొండ: బాల్కొండ గ్రామపంచాయతీ నోటీసు బోర్డుపై ప్రదర్శించిన రెండు పడక గదుల ఇళ్ల అనర్హుల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జాబితాలో పలువురు అర్హుల పేర్ల వద్ద ‘ప్రజా పాలన దరఖాస్తు లిస్టులో పేరు లేదు’ అని రిమార్క్‌ చేయడంపై మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎంఏ షాహీద్ ప్రశ్నించారు. ప్రజా పాలన దరఖాస్తులో రెండు పడక గదుల ఇళ్లకు ప్రత్యేక ఆప్షన్ లేనప్పుడు, ఆ కారణంతో అనర్హులుగా పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు.అధికారులు ఈ జాబితాను మరోసారి సమగ్రంగా పరిశీలించి, అర్హత ఉన్న పేద కుటుంబాలకు అన్యాయం జరగకుండా చూడాలని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని షాహీద్ కోరారు.