పిట్టల సంరక్షణకు పిట్టగూళ్లు ఏర్పాటు
చిట్యాల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 8 పిట్టగూళ్లు ఏర్పాటు నిర్మల్: పక్షులకు గూళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుకూలమైన వాతావరణం తగ్గిపోవడంతో వాటికి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చిట్యాల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 8 పిట్టగూళ్లను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ ఏనుగు సుప్రియ–వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరుల సహకారంతో ఈ పిట్టగూళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యుడు సతీష్ మాట్లాడుతూ.. పిట్టలు, ఇతర పక్షులు ప్రకృతిలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. పక్షులకు ఆహారం, నీటితో పాటు గూడు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పక్షుల సంరక్షణతో పర్యావరణ సమతుల్యతను...