చిట్టాపూర్ పాఠశాలలో హిందీ దివస్

బాల్కొండ : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాపూర్ లో హిందీ దివస్ నిర్వహించనైనది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు హిందీ సాహితీ క్విజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది. హిందీలో హాస్య నాటికను విద్యార్థులు చక్కని అభినయంతో ప్రదర్శించారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు బహుమతులను అందజేశారు. హెడ్మాస్టర్ హిందీ భాష ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు నర్సారెడ్డి,భృగు మహర్షి, రామారెడ్డి, శ్రీనివాస్, పద్మ, హిందీ భాషోపాధ్యాయులు ప్రవీణ్, రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.