subhodayam.news
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 1:18 pm Digital Edition : Narendhar

బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

బాల్కొండ :బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ ఙ్ఞాన సాగర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకై ప్రతి ఒక్కరూ మట్టి గణపతి పూజించాలని ఆయన అన్నారు పాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన విగ్రహాల వల్ల పర్యావరణ పరిరక్షణకు హాని కలుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం మట్టి విగ్రహాలను గ్రామస్తులకు అందజేశారు ఈ కార్యక్రమంలోసర్పంచ్ రామరాజు గౌడ్,  లైన్స్ క్లబ్ రీజినల్ సెక్రటరీ చాకు లింగం , బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు యాదగిరి గౌడ్, ఉపాధ్యక్షులు మర్కా కనకయ్య గౌడ్  , క్లబ్ సభ్యులు, వంశీదర్ రెడ్డి, మల్లెపూల శ్రీనివాస్ గౌడ్, పోతూ ప్రసాద్, ఉప సర్పంచ్ చిలెవరీ స్వామినాథ్,కృష్ణకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.