వేల్పూర్: వ్యాసరచన పోటీలో పాల్గొన్న క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో వేల్పూర్ రెవెన్యూ శివారులో గల కుండలిని జ్ఞాన యోగి అవధూత శ్రీ శ్రీ శ్రీ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమంలో శుక్రవారం ఆర్మూర్ మండలంలోని క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు “కృతజ్ఞత” అనే అంశంపై వ్యాసరచన పోటీని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన ఆధ్యాత్మికవేత్త,ధర్మ ప్రచారకులు శ్రీ రాఘవేంద్ర స్వామి,కమిటీ సభ్యులు జ్యోతి ప్రకాశనం చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అనంతరం తెలుగు, ఆంగ్లభాషలో 178 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మందాపురం లింబాద్రి గౌడ్ కొయ్యల రాఘవేందర్,కూశన్నగారి నర్సయ్య,
అబ్బగోని జగదీశ్వర్ గౌడ్,నోముల గంగారెడ్డి,సాయిరాం బాలరాజ్,గడ్డం మల్లేష్,కొండ అశోక్ గౌడ్,మహేందర్,కంకణాల రాజేశ్వర్,తీగల రఘు,కమిటీ సభ్యులు,స్వచ్ఛంద సేవకులు తదితరులు పాల్గొన్నారు.