పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతులనే ప్రతిష్టించాలి…

ఆర్మూర్: ప్రతీ ఏటా జరిగే "వినాయక చవితి" ఉత్సవాలలో పర్యావరణ పరిరక్షణకై మట్టితో తయారుచేసిన గణపతులనే ప్రతిష్టించాలని పర్యావరణ ప్రేమికుడు విశ్రాంత ఉపాధ్యాయుడు జింధం నరహరి పిలుపునిచ్చారు. రిటైర్డ్ టీచర్ జింధం నరహరి మాట్లాడుతూ... గతంలో సైన్స్ టీచర్ గా తాను పనిచేసిన ప్రతీ పాఠశాలలో విద్యార్థులచే మట్టి సేకరించి,మట్టి గణపతులను తయారు చేయించి,విద్యార్థులకు గ్రామస్తులకు పంపిణీ చేసి మట్టి గణపతుల యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కలిగించే వాడినని అన్నారు.ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన మట్టి గణపతులు పైకి అందంగా కనిపించినా నిమర్జనం సమయంలో ఆ రసాయనాలు కొన్ని నీటిలో కరగక కొన్ని నీటిలో కరిగి కాలుష్యాన్ని...