subhodayam.news
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 7:09 pm Digital Edition : Jindham Narahari

పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతులనే ప్రతిష్టించాలి…

ఆర్మూర్: ప్రతీ ఏటా జరిగే “వినాయక చవితి” ఉత్సవాలలో పర్యావరణ పరిరక్షణకై మట్టితో తయారుచేసిన గణపతులనే ప్రతిష్టించాలని పర్యావరణ ప్రేమికుడు విశ్రాంత ఉపాధ్యాయుడు జింధం నరహరి పిలుపునిచ్చారు. రిటైర్డ్ టీచర్ జింధం నరహరి మాట్లాడుతూ… గతంలో సైన్స్ టీచర్ గా తాను పనిచేసిన ప్రతీ పాఠశాలలో విద్యార్థులచే మట్టి సేకరించి,మట్టి గణపతులను తయారు చేయించి,విద్యార్థులకు గ్రామస్తులకు పంపిణీ చేసి మట్టి గణపతుల యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కలిగించే వాడినని అన్నారు.ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన మట్టి గణపతులు పైకి అందంగా కనిపించినా నిమర్జనం సమయంలో ఆ రసాయనాలు కొన్ని నీటిలో కరగక కొన్ని నీటిలో కరిగి కాలుష్యాన్ని ఏర్పరచి పశువులకు,జలచరాలకు,మనుషులకు చర్మవ్యాధులు సంభవించే అవకాశం ఉందని సూచించారు.  రసాయనాలతో హానికరం : సాంప్రదాయంగా కొనుగోలు చేస్తున్న రంగు రంగుల గణపతులను ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ (పీవోపీ) లతో తయారు చేయడం వలన అనేక అనర్ధాలు కలుగుతున్నాయని,పీవోపీ లో జిప్సం,సల్ఫర్,మెగ్నీషియం, సిలికాన్ అనే రసాయనాలు ఉంటాయన్నారు. గణనాథులను నిమర్జనం చేసిన సందర్భంలో అవి నీటిలో కరగక భూమిలో ఇంకిపోకుండా నీరు కలుషితమవుతుందన్నారు.ఈ కలుషిత నీటి ద్వారా నీటిలోని జలచరాల మనుగడకు హాని కలుగడంతో పాటు ఆ నీటిలోని జీవులు చర్మవ్యాధుల బారిన పడే ప్రమాదముందన్నారు.

మట్టి గణపతులతో పర్యావరణ పరిరక్షణ : మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించడం వలన పర్యావరణ పరిరక్షణకు తోడ్పడిన వారమవుతామని, మట్టి గణపతల తయారీల వలన బంక మట్టి మన శరీరానికి తగలడం వల్ల మృతకణాలు తొలగిపోయి జీవచైతన్యం కలుగుతుందన్నారు. సహజ రంగులకు వాడే వివిధ రకాల మొక్కల పూలు,ఆకులు బెరడుల వల్ల నీటి కాలుష్యం ఉండదని,గణపతి పూజలో ఉపయోగించే 21 రకాల ఔషధ మొక్కలైన మాచు పత్రి, వాకుడాకు,మారేడు,గరికే,ఉమ్మెత్త,రేగి,ఉత్తరేణి,తులసి, మామిడి,గన్నేరు,జిల్లేడు,రావి,జమ్మి తదితర పువ్వులు, పత్రాలు వాతావరణలోని సూక్ష్మజీవులను హరించి వేస్తాయని,ఔషధ మొక్కలు నీటిని శుద్ధి చేసి,జలచరాలకు వ్యాధులు రాకుండా కాపాడుతాయన్నారు.