బాల్కొండ: పోలీస్ వాహనాలు తనిఖీ చేస్తుంటే ఆమడ దూరం నుంచి తప్పించుకుని తిరిగే వాహనదారులు ఉన్న ఈ రోజుల్లో ఓ వాహనదారుడు తన వద్ద వాహనం లేక పోయినా తన బైక్ పైన చలాన్ లు మొత్తం చెల్లించి ఆదర్శంగా నిలిచారు.
బాల్కొండ ఎస్సై శైలేందర్ మరియు పోలీసు సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో నల్లూర్ రాజేశ్వర్ అనే వ్యక్తి పోలీసు వారిని సమీపించి తన ద్విచక్ర వాహనం తన దగ్గర లేకున్నప్పటికీ పోలీసు వారి దగ్గర ఉన్న TS e -ticket app ద్వారా తన ద్విచక్ర వాహనంపై గల 8 చలాన్లు 2680/- తనకు తానుగా స్వచ్ఛందంగా చెల్లించడం జరిగింది. ఇలాంటి బాధ్యతగల పౌరులు నేటి సమాజానికి ఆదర్శవంతులుగా ఉండగలరని ఎస్ఐ శైలేందర్ నల్లూర్ రాజేశ్వర్ ను అభినందించారు.. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనాలపై గల చలాన్లు పోలీసువారిని సంప్రదించి TS e – ticket యాప్ ద్వారా గాని లేదా మీసేవ ద్వారా గాని చెల్లించ వచ్చుని అన్నా రు. అందరూ పెండింగ్ చలానాలని క్లియర్ చేసుకోవాలని ఆయన కోరారు.
.