subhodayam.news
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 10:29 am Digital Edition : RAJU CH

వినాయక చవితి వేడుకలకు పటిష్ట భద్రత..5న ఆర్మూర్లో ప్రత్యేక సమావేశం

మెండోరా: వినాయక చవితి పండుగను శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ నెల 5న ఆర్మూర్‌లోని క్షత్రియ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని తెలిపారు.మెండోరా  పోలీస్‌స్టేషన్ పరిధిలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్న యువకులు, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గణేష్ మండపాల నిర్వాహకులు సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె సూచించారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ హాజరై, రానున్న పండుగలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను అందిస్తారని తెలిపారు.
ప్రతి గణేష్ మండపం నిర్వాహకుడు, సంబంధిత యువకులు సమావేశానికి హాజరై పోలీసులకు సహకరించాలని ఎస్సై జాదవ్ సుహాసిని కోరారు. ప్రజలందరూ సమన్వయంతో పండుగను ప్రశాంతంగా నిర్వహించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.