ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఎంపాల రాధ నియామకం…
ఆర్మూర్: ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి ఆధ్వర్యంలో గతంలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా కొనసాగిన అరుణ జ్యోతి పదవీకాలం ముగిసినందున నూతన అధ్యక్షురాలుగా ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్ గ్రామానికి చెందిన ఎంపాల రాధా ను నియమిస్తున్నట్లు పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి,ప్రధాన కార్యదర్శి బొంత సాయన్న ప్రకటించారు.ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు కత్తి లక్ష్మి,కొత్త సుజాత,రాగుల వనిత, హక్కు ఇందిరా ఎంపాల ఆర్య తదితరులు పాల్గొన్నారు.