లింగంపేట్ మండల అభివృద్ధి అధికారి మీసాల బ్రహ్మానందరావు సేవలు మరువలేనివి…

ఆర్మూర్:మున్సిపల్ పరిధిలోని ఎమ్మార్ గార్డెన్ లో వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామ వాస్తవ్యులు మీసాలు బ్రహ్మానందరావు ప్రస్తుతం మండల అభివృద్ధి అధికారిగా లింగంపేట్ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు.ఈ నెల 31వ తేదీన "ఉద్యోగ విరమణ" పొందుతున్న సందర్భంగా ఆత్మీయ బంధువులు,మిత్రులు, శ్రేయోభిలాషులందరి సమక్షంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సన్మాన గ్రహీత దంపతులు మీసాల బ్రహ్మానందరావు - సతీమణి ఉమాదేవి దంపతులను పూలు చల్లుతూ వేదిక పైకి ఆహ్వానించారు.అతిథుల ఆహ్వానం తర్వాత ప్రముఖ పూజారి నాగేశ్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం,ఆశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించి,జ్యోతి ప్రజ్వలన గావించారు.రిటైర్డ్ టీచర్ జింధం నరహరి రూపొందించిన అభినందన నామాక్షరమాలను సన్మాన...