కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టిన బీసి సెల్ పట్టణ అధ్యక్షులు ధోండి రమణ…
ఆర్మూర్ : కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలపై బీఆర్ఎస్ అబద్దపు ప్రచారాలు మానుకోవాలని బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు ధోండి రమణ అన్నారు.కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న నిరాధారమైన అబద్ధపు ఆరోపణలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు ధోండి రమణ మండిపడ్డారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళ్యాణ లక్ష్మి పథకానికి చట్టబద్ధత కల్పించకపోవడం వల్లే నేడు హైకోర్టులో న్యాయపరమైన సమస్యలు తలెత్తితే,అసలు ఈ పథకాలనే నిలిపివేస్తు న్నారంటూ అబద్ధపు ప్రచారం చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకాలపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని,ఏలాంటి లొసుగులు లేకుండా సరైన విధానంలో...