పెర్కిట్ లో ఆరోగ్య విద్య బోధించిన ఆరోగ్య విస్తరణాధికారి వై.శంకర్…

ఆర్మూర్:మహాత్మ జ్యోతిభా ఫూలే పాఠశాల,పెర్కిట్ లో విద్యార్థులకు వైద్య ఆరోగ్యశాఖ ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ ఆరోగ్య విద్య బోధించారు.మహాత్మ జ్యోతిభా ఫూలే పాఠశాలలో విద్యార్థులకు క్రింది ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించబడింది: *రక్తహీనత (అనీమియా)రక్తహీనతకు కారణాలు,లక్షణాలు మరియు నివారణపై అవగాహన కల్పించారు.ఆకుకూరలు, పప్పులు,శనగలు, బెల్లం, గుడ్లు తదితర ఇనుము సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు.ఐరన్–ఫోలిక్ యాసిడ్ మాత్రలను ఆరోగ్య సిబ్బంది సూచించిన విధంగా తీసుకోవాలని తెలియజేశారుఆరోగ్య, విద్యా మరియు సామాజిక సమస్యలపై అవగాహన కల్పించారు. *సీజనల్ వ్యాధులు వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ,మలేరియా,వైరల్ జ్వరాలు వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం,దోమల నివారణ చర్యలు...