subhodayam.news
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 11:51 am Digital Edition : Jindham Narahari

పెర్కిట్ లో ఆరోగ్య విద్య బోధించిన ఆరోగ్య విస్తరణాధికారి వై.శంకర్…

ఆర్మూర్:మహాత్మ జ్యోతిభా ఫూలే పాఠశాల,పెర్కిట్ లో విద్యార్థులకు వైద్య ఆరోగ్యశాఖ ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ ఆరోగ్య విద్య బోధించారు.మహాత్మ జ్యోతిభా ఫూలే పాఠశాలలో విద్యార్థులకు క్రింది ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించబడింది:
*రక్తహీనత (అనీమియా)రక్తహీనతకు కారణాలు,లక్షణాలు మరియు నివారణపై అవగాహన కల్పించారు.ఆకుకూరలు, పప్పులు,శనగలు, బెల్లం, గుడ్లు తదితర ఇనుము సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు.ఐరన్–ఫోలిక్ యాసిడ్ మాత్రలను ఆరోగ్య సిబ్బంది సూచించిన విధంగా తీసుకోవాలని తెలియజేశారుఆరోగ్య, విద్యా మరియు సామాజిక సమస్యలపై అవగాహన కల్పించారు.
*సీజనల్ వ్యాధులు
వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ,మలేరియా,వైరల్ జ్వరాలు వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు.
పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం,దోమల నివారణ చర్యలు పాటించడం,జ్వరం వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించడం గురించి వివరించారు.
*చేతులు కడుక్కునే పద్ధతులు:భోజనం ముందు,మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత మరియు చేతులు మురికిగా ఉన్నప్పుడు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.చేతులు కడుక్కోవడానికి సరైన దశలను ప్రదర్శన ద్వారా వివరించారు.
*పౌష్టికాహారం,ప్రతిరోజూ సమతుల్య ఆహారం తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.ధాన్యాలు,పప్పులు,కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు/పాల పదార్థాలు, గుడ్లు వంటి పోషకాహారాన్ని ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు.
జంక్ ఫుడ్,అధిక చక్కెర కలిగిన పానీయాలను తగ్గించాలని అవగాహన కల్పించారు.కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బస్తీ దవఖానా వైద్యాధికారి డాll ప్రియాంక,వైస్ ప్రిన్సిపాల్ రజిత,హెల్త్ సూపర్వైసర్ యామిని,ఆరోగ్య కార్యకర్త అరుణ కవిత,మోహన్ జక్కుల ఉపాధ్యాయులు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.