మోర్తాడ్ : గ్రామ పంచాయతీ కార్యాలయంలో జీవ వైవిధ్య పరిరక్షణ కమిటీ (BMC) సమావేశం చైర్మన్,సర్పంచ్ పుప్పాల నరేష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు,పంచాయతీ ప్రతినిధులు పాల్గొని గ్రామ పరిధిలోని సహజ వనరుల పరిరక్షణ,జీవ వైవిధ్య నమోదు ప్రక్రియపై చర్చించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పుప్పాల నరేష్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రకృతి వనరులను,వృక్ష,జంతు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.భవిష్యత్ తరాలకు పర్యావరణ సమతుల్యతను అందించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో తీర్మాణించిన విధులు:
👉 కార్యాచరణ:
పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ (PBR):గ్రామంలో లభించే ఔషధ మొక్కలు, చెట్లు,పంట రకాలు,పెంపుడు మరియు అటవీ జంతువులు,పక్షుల వివరాలను అధికారికంగా నమోదు చేయడం.చెరువులు,
👉 జలవనరుల రక్షణ:గ్రామ పరిధిలోని చెరువులు, కుంటలు, నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడటం మరియు భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపట్టడం.
👉 వృక్ష సంపద పరిరక్షణ: రోడ్లకు ఇరువైపులా,ఖాళీ ప్రదేశాల్లో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలు చేపట్టడం మరియు విచక్షణారహితంగా చెట్లను నరకడాన్ని అరికట్టడం.
👉 సాంప్రదాయ విజ్ఞాన పరిరక్షణ:గ్రామంలో తరతరాలుగా వస్తున్న దేశవాళీ విత్తనాలు,నాటు వైద్య పద్ధతుల వివరాలను భద్రపరచడం.
👉 ప్రజా చైతన్యం:ప్లాస్టిక్ నియంత్రణ, తడి-పొడి చెత్త వేరు చేయడం,పర్యావరణ పరిరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించడం.
ఈ కార్యక్రమంలో జీవ వైవిధ్య పరిరక్షణ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు,పంచాయతీ కార్యదర్శి నరేందర్,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.