చేపూర్ దత్త సాయి ఆలయంలో పూజలు, అభిషేకాలు అన్నదాన కార్యక్రమం…
ఆర్మూర్ మండలంలోని చేపూర్ దత్త సాయి ఆలయంలో సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు ఎస్.కే.రవీందర్ మాట్లాడుతూ ప్రతీ గురువారం కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి ప్రతీ గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించవచ్చన్నారు.అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించబోయే దాతలు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9848471908...ఈ కార్యక్రమంలో సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు బాజన్న,లింగన్న,రాజు,శ్రీను,రఘు, బాలయ్య,వెంకటేష్,ప్రభాకర్,రవి కాక కార్ కన్సల్టెన్సీ అధినేత తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ రవి కాక తదితరులు పాల్గొన్నారు.