subhodayam.news
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 9:21 am Digital Edition : Narendhar

వృద్ధుల.. ఆశలపై నీళ్లు చల్లుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

వృద్ధుల..ఆశలపై నీళ్లు ఒక ఇంట్లో ఒకే పింఛన్ ఎందుకు..? మేము అధికారంలోకి వస్తే రెండు పింఛన్లు ఇస్తాం’ అని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల వరకు ఊరించి ఉసూరు మనిపించింది. చేయూత పథకంలో ఇచ్చే పింఛన్లలో వృద్ధులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయిచ్చిందని బాల్కొండ మండలం మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎంఏ, షహీద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పట్లో వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. ఇటీవల కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభించింది. ఈనెల 31 వరకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించడానికి గడువు విధించింది. దివ్యాంగులు, వితంతు, ఒంటరి మహిళలు, తలసీమియా, డయాసిస్ తదితర వాటి కోసం కొత్త దరఖాస్తు నమూనాను కూడా విడుదల చేసింది. కానీ వృద్ధాప్య పింఛన్ దరఖాస్తులు మాత్రం స్వీకరించడం లేదు..వృద్ధాప్య పింఛన్ దరఖాస్తులు కూడా స్వీకరించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాల్కొండ మండలం మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎంఏ, షహీద్ డిమాండ్ చేశారు.