బాల్కొండ: బాల్కొండ మండలం కిసాన్ నగర్‌లోని తన నివాసంలో మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి బహుజన చక్రవర్తి, ధీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. పాపన్న గౌడ్ గారి ఆశయాలు, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అనిల్ ఈరవత్రి పేర్కొన్నారు.