నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కవిత కాంప్లెక్స్ లో గల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అసిస్టెంట్ చిట్స్ రిజిష్ట్రార్ పోలేపల్లి రవీందర్ పతాకావిష్కరణ చేసి,తోటి సహచర ఉద్యోగులందరికీ పేరుపేరునా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకతమైన మన భారతదేశం కులాలు,మతాలు,ప్రాంతాలు, భాషలకు అతీతంగా జాతీయ సమైక్యతతో సోదర భావంతో మెదిలే గొప్పదేశమన్నారు.80 వసంతాలుగా దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తూ ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి ఎదిగామంటే అతిశయోక్తి కాదు.140 కోట్ల జనాభా గల మన భారత దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా,అగ్రగామిగా నిలుస్తోందన్నారు.ప్రతి పౌరుడు హక్కులతో పాటు బాధ్యతలు గుర్తెరిగి మెదలాలని,దేశ రక్షణకై సంసిద్ధులై ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్స్ రవికాంత్,ప్రసాద్,సతీష్ కుమార్,కే.చంద్రశేఖర్,సహోద్యోగులు కవిత,సుజాత, శోభారాణి,సాయిలు,వంశీ తదితరులు పాల్గొన్నారు.