ఆర్మూర్:సైదాబాద్ కాలనీకి చెందిన అబుల్ హుస్సేన్ (ఆర్మూర్ గాంధీ) భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తన సొంత ఆటోకు మైక్ సెట్ బిగించుకుని,ఆటోకు జాతీయ జెండాను అలంకరించి వీధి,వీధి నా తిరుగుతూ జాతీయ ఔన్నత్యాన్ని చాటి చెప్పే సినిమా పాటలతో పురవీధుల్లో వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా అబుల్ హుస్సేన్ (ఆర్మూర్ గాంధీ) మాట్లాడుతూ భిన్నతంలో ఏకత్వమైన మన భారతదేశం లౌకిక రాజ్యమని జాతీయ సమైక్యతతో దేశ ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని,గాంధీజీ కలలుగన్న రామరాజ్య స్థాపనకై ప్రతీ పౌరుడు హక్కులతో పాటు బాధ్యతలు గుర్తెరిగి మెలగాలన్నారు.ఈ సందర్భంగా భారత పౌరులందరికీ పేరుపేరునా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.