subhodayam.news
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 5:38 pm Digital Edition : Jindham Narahari

ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…

ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పెన్షనర్స్ భవన్ ముందు అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి,సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కన్వీనర్ రామ్మూర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ముఖ్య అతిథులుగా పెన్షనర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు,తహసీల్దార్ సత్యనారాయణ,డిప్యూటీ తహసీల్దార్ సుజాత,సీనియర్ న్యాయవాది లోక భూపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్,ఆర్థిక కార్యదర్శి నవజీవన్,గౌరవ అధ్యక్షులు రాం రెడ్డి,జిల్లా బాధ్యులు కరుణాసాగర్ రెడ్డి,పుష్పకర్ రావు లు పాల్గొన్నారు.

అతిథులు మాట్లాడుతూ ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వేచ్ఛా భారతానికి 80 వసంతాల వేడుకలను జరుపుకుంటున్నాం.ఈ పవిత్రమమైన సందర్భంగా జాతీయ జెండా ఎగరేసి,దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పిద్దామన్నారు.సమైక్యత కోసం మనం కృషి చేద్దాం.అభివృద్ధి కోసం మనం అడుగులు వేద్దాం.భారత ప్రగతి కోసం మన వంతు బాధ్యతలు నిర్వర్తిద్దామన్నారు.వివిధ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.ప్రతీ జాతీయ పండుగలకు హితోధికంగా సహకరిస్తున్న రామ్మూర్తి,ఓబన్న,అంజయ్య ల సేవలను అభినందించి శాలువలతో సత్కరించారు.