ఆర్మూర్ పట్టణంలోని పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పాత బస్టాండ్ మార్కండేయ మందిరం వద్ద గల 3వ తర్ప పట్టణ సంఘం ఆవరణలో పట్టణ సంఘం అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ జాతీయ జెండాను ఎగరవేశారు.ఈ సందర్భంగా అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వమైన మన భారతదేశం కులం,మతం,ప్రాంతం,భాషలకు అతీతంగా ముందు దేశం – తర్వాత మనం అనే భావనతో ముందుకు సాగుదామన్నారు.140 కోట్ల జనాభాతో ప్రపంచ దేశాలలో అన్ని రంగాలలో మన భారతావని అగ్రగామిలో నిలుస్తుందన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసి,బాలికల ఉన్నత పాఠశాల నుండి వచ్చిన చిన్నారులకు రెండు వాలీబాల్స్ బహుమతిగా అందజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు,8 తర్పల అధ్యక్షులు,పద్మశాలి కుల బాంధవులు,బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.