subhodayam.news
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 12:55 pm Digital Edition : Narendhar

దాసన్మాన్ మందిరంలో శ్రావణమాస అఖండ దీపారాధన

బాల్కొండ: ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా బాల్కొండ మండల కేంద్రంలోని దాస్ హనుమాన్ మందిరంలో గురువారము ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రావణమాస అఖండ దీపారాధన ను వెలగించారు. ప్రముఖ ఆధ్యాత్మిక సేవకులు, ఆలయ బాధ్యులు ఠాగూర్ బలరాం సింగ్, బీబీసీ సాయన్న లు కమిటీ సభ్యులతో కలిసి ఈ దీపారాధన చేశారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో  ఈ అఖండ జ్యోతిని ఆరాధిస్తారు. వచ్చే అమావాస్య వరకు నిరంతరంగా ఈ జ్యోతి వెలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.