subhodayam.news
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 6:43 pm Digital Edition : jindham narahari

తిమ్మాపూర్ లో స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీ…

మోర్తాడ్:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాల పక్కా అమలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తిమ్మాపూర్ గ్రామంలో సర్పంచ్ పుప్పాల నరేష్ అధ్యక్షతన భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో గ్రామస్తులకు ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం,
దీనితో పాటు గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.తడి,పొడి చెత్త,సానిటరీ చెత్త,ప్రత్యేక జాగ్రత చెత్త అను 4.రకాలుగా సేకరణ,వాటిని వేరుచేసి అందించే విధానంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు.అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నీ వినియోగించిన వారికి 5000/- జరిమాన విధించబడును అని గ్రామ సభ తీర్మానం చేయడం జరిగింది, మరియు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ తూచా తప్పకుండా అమలు చేస్తోంది.ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ,ప్రతి పథకాన్ని క్షేత్ర స్థాయిలో అర్హులకు చేరవేస్తున్నాం.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సదానంద్,సెక్రటరీ బాస నరేందర్,పాలక వర్గం మరియు వివిధ శాఖల గ్రామ స్థాయి అధికారులు,పంచాయతీ సిబ్బంది,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.