subhodayam.news
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:47 pm Digital Edition : Jindham Narahari

ఆర్మూర్ ఆర్యవైశ్య యువజన అధ్యక్షుడిగా భారీ మెజార్టీతో శైలేష్ ఎన్నిక…

ఆర్మూర్:ఆర్మూర్ ఆర్యవైశ్య సంఘం యువజన విభాగం అధ్యక్షుడిగా ఉత్తర్వార్ శైలేష్ ఎన్నికయ్యారు.యువజన అధ్యక్ష పదవికి నిర్వహించిన ఎన్నికల్లో శైలేష్ భారీ మెజార్టీతో విజయం సాధించారు.అధ్యక్షుడిగా ఎన్నికైన శైలేష్ ను ఆర్మూర్ హౌసింగ్ బోర్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు రామోజీ దశరథ్ ప్రధాన కార్యదర్శి ఆత్మ చరణ్ మాట్లాడుతూ యువకుల తో కలివిడిగా ఉండే శైలేష్ ఈ పదవితో ఆర్యవైశ్యులు ఔన్నత్యాన్ని కాపాడుతూ వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్లాలని,వారి కార్యవర్గానికి కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శ్రీ రామోజీ దశరథ్,హౌసింగ్ బోర్డు ప్రధాన కార్యదర్శి ఆత్మచరణ్, కోశాధికారి దీకొండ కిషన్, కరుణాకర్ రెడ్డి,శ్రీధర్ రెడ్డి, జగన్ గౌడ్,పుష్పకార్ రావు, రాంరెడ్డి, సురేందర్ గౌడ్, బీఎస్‌ఎన్‌ఎల్ రాంప్రసాద్ తదితరులు పాల్గొని,ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన అధ్యక్షుడిగా ఎన్నికైన ఉత్తర్వార్ శైలేష్ కు శాలువతో సత్కరించి అభినందనలు,శుభాకాంక్షలు తెలియయజేశారు.