బాల్కొండ: నిజామాబాదు జిల్లా బాల్కొండలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న “హర్ ఘర్ తిరంగా అభియాన్–2026” సన్నాహక యాత్ర మంగళ వారం కొనసాగింది.ఈ కార్యక్రమాన్ని బాల్కొండ మండల బి. జె. పీ ఆధ్వర్యంలో
నిర్వహించారు. *’హర్ ఘర్ తిరంగా* యాత్రలో జిల్లా పరిషద్, శంబావి, వెంకటేశ్వరా, మదర్ థెరిసా,జ్యోతి రావు పూలె, పలు పాఠశాలల జాతీయ జెండాలు పట్టుకొని పలు వీధుల్లో దేశ భక్తి నినాదాలు చేస్తూ ఊరేగించారు. అనంతరం జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో మైదానంలో జరిగిన సమావేశంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ “నేషన్ ఫస్ట్, పర్సన్ లాస్ట్” అనే నినాదంతో మొత్తం భారతదేశ ప్రజలను జాగృత పరిచే నినాదంతో *’హర్ ఘర్ తిరంగా’* నినాదాన్ని ఎత్తుకున్న గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు నిర్వహించా మని మల్లికార్జున్ రెడ్డి వివరించారు.
ఆగస్టు 10 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి ప్రతి గుండెల్లో దేశభక్తిని చాటలని బాల్కొండ మండల బి. జె. పీ నాయకులు ముప్కాల్ మాజీ సర్పంచ్ ముస్కు భూమేష్ విద్యార్థుల్ని కోరారు.అనంతరం జిల్లా బి. జె. పీ నాయకులు,మాజీ ఏం. పీ. పీ లావణ్య లింగాగౌడ్
హాజరై, హర్ ఘర్ తిరంగా అభియాన్ ప్రాముఖ్యతను వివరించారు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి, దేశభక్తి మరియు జాతీయ ఐక్యతను చాటాలని లింగా గౌడ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా షాబాద్ మండలంలో హర్ ఘర్ తిరంగా యాత్రను విజయ వంతంగా నిర్వహించి నందుకు
బాల్కొండ బి. జె. పీ. అధ్యక్షులు అంబటి నవీన్ మాట్లాడుతూ అన్ని పాఠశాలల విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీ.జే.పీ.బాల్కొండ మండల ప్రధానకార్యదర్శులు సాయికిరణ్, నక్కల గణేష్, బి.జె.పి,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తోట చిన్నయ్య, బీ.జే.వై.ఎం,కిసాన్ మోర్చా, ఓ.బీ.సీ మోర్చా మండల అధ్యక్షులు సాయికార్తీక్, ఆరెపల్లి నర్సయ్య, కళ్లెం సుధాకర్, మండల ఉపాధ్యక్షులు బూసం సత్యనారాయణ, కాలరవి, కార్యదర్శులు కడ్తల్ రాజేశ్వర్, ఐరా ప్రవీణ్, భూమేష్, నాయకులు సుంకం శ్రీనివాస్, బి. ఆర్. నర్సింగ్ రావు,ఆరెపల్లి రవిందర్, తోట నవీన్, నాగరాజు,తోట నాగేష్, తోపారం అశోక్, ఉట్నూర్ రాంకిషన్, కన్న రెడ్డి,దుడ్డేల దేవేందర్, జక్కం శ్రీకాంత్, దికొండ రాజు, చెల్మెల రమేష్, సోన్న పోశెట్టి, నానం నరేష్, కాల బాబు, అడ్వాళా గంగాధర్, మద్దుల రమేష్, అగ్గు శ్రీనివాస్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.