subhodayam.news
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 1:27 pm Digital Edition : jindham narahari

పెర్కిట్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ఫ్రొపెసర్ జయశంకర్ జయంతి వేడుకలు…

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ మద్దికుంట శ్రీనివాస్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలని,తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర కీలకమని వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.