తాళ్ళరాంపూర్ సర్పంచ్ బెజ్జారం పావని కుటుంబానికి లక్ష రూపాయలు వితరణగా అందజేత…

నందిపేట్: ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి బెజ్జరం పావని ఇటీవల జరిగిన అకాల మరణం ఎంతో బాధాకరం. వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసేందుకు నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ గ్రామ సర్పంచ్ శ్రీ ఎర్రం లింగం  ఆధ్వర్యంలో, దివంగత సర్పంచ్ కుటుంబానికి రూ.1,00,000/- (అక్షరాల: ఒక లక్ష రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అయిలాపూర్ సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉమ్మేడ సర్పంచ్ బొజేందర్, లక్కంపల్లి సర్పంచ్ సంతోష్ గౌడ్, బజార్ కొత్తూర్ సర్పంచ్ గోపు ముత్యం, సిద్ధాపూర్...