subhodayam.news
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 2:45 pm Digital Edition : Jindham Narahari

తాళ్ళరాంపూర్ సర్పంచ్ బెజ్జారం పావని కుటుంబానికి లక్ష రూపాయలు వితరణగా అందజేత…

నందిపేట్: ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి బెజ్జరం పావని ఇటీవల జరిగిన అకాల మరణం ఎంతో బాధాకరం. వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసేందుకు నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు గ్రామాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ గ్రామ సర్పంచ్ శ్రీ ఎర్రం లింగం  ఆధ్వర్యంలో, దివంగత సర్పంచ్ కుటుంబానికి రూ.1,00,000/- (అక్షరాల: ఒక లక్ష రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో అయిలాపూర్ సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉమ్మేడ సర్పంచ్ బొజేందర్, లక్కంపల్లి సర్పంచ్ సంతోష్ గౌడ్, బజార్ కొత్తూర్ సర్పంచ్ గోపు ముత్యం, సిద్ధాపూర్ సర్పంచ్ ఇర్పి మహేష్, అలాగే సీనియర్ నాయకులు ధర్మన్న (ఖుదావన్‌పూర్), రామకృష్ణ (ఆంధ్రనగర్), జంగిడి దేవీదాస్ (కొండూరు), నవీన్ (కౌల్‌పూర్), మురళి (చిమ్రాజ్‌పల్లి), సుధన్ (బద్గుణ) తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

దివంగత బెజ్జరం పావని ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.