అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందించాలి: మెండోర సర్పంచ్

మెండోర: మెండోర మండలంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అర్హులైన నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలని మెండోర గ్రామ సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ గ్రామాల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని విమర్శించారు. మెండోరను పట్టణంగా అభివృద్ధి చేస్తామని గతంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలకు ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. నిలిచిపోయిన...