subhodayam.news
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 12:08 pm Digital Edition : RAJU CH

అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందించాలి: మెండోర సర్పంచ్

మెండోర: మెండోర మండలంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అర్హులైన నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలని మెండోర గ్రామ సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్ కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ గ్రామాల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని విమర్శించారు. మెండోరను పట్టణంగా అభివృద్ధి చేస్తామని గతంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలకు ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. నిలిచిపోయిన పంపిణీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని ప్రజా ప్రభుత్వాన్ని కోరారు.

ఈ విషయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్  ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారం ఉంటుందని, మెండోర గ్రామ ప్రజల మద్దతు కూడా పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పారు. ప్రజాప్రతినిధులందరూ కలిసి అర్హులైన పేద కుటుంబాలకు న్యాయం జరిగేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్‌పై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేశ్వర్, నాయకులు కొప్పేల మోహన్, మౌలానా, అశోక్, దేవరాజు, శ్రీనివాస్, కరీం, గంగాధర్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.