పోషణ్ అభియాన్ – ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా చాకిరియాల్లో నిర్వహణ

మెండోరా: పోషణ్ అభియాన్ – ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మెండోర మండలంలో చాకిరియల్ లో  ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల విశిష్టత, శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలు ఎంత ముఖ్యమో అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించి, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం చేపట్టారు. ప్రతి తల్లి తన బిడ్డకు పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని, మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలే అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బద్రి శ్రీనివాస్, అంగన్‌వాడీ సూపర్వైజర్ అనురాధ, పంచాయతీ కార్యదర్శి, మెండోర మండలంలోని అంగన్‌వాడీ టీచర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది, పాఠశాల సిబ్బంది...