మానవతా విలువలు గల మహర్షి అన్నా గౌడ దత్తాద్రి గౌడ్ 6 వ వర్ధంతి వేడుకలు…
నందిపేట్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ అన్నా గౌడ దత్తాద్రి గౌడ్ మంచితనం మానవత్వం మూర్తిభవించిన గ్రామ మాజీ సర్పంచ్,మాజీ ఎంపీపీ సిద్దాపూర్ గ్రామ ప్రజల గుండె చప్పుడు తానై కష్ట,సుఖాలలో భాగస్వామ్యులై గ్రామ అభివృద్ధికై అహర్నిశలు కృషిచేసిన రాజకీయ దురదరులు.రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా,మొదటి ఇంటర్నెట్ గ్రామంగా తీర్చిదిద్ది, అందరూ "తాత" అని ముద్దుగా పిలుచుకునే దత్తాద్రి గౌడ్ సేవలు అజరామరమని కీర్తిస్తూ,అభినందిస్తూ ప్రత్యక్షంగా వారు లేకపోయినా వారి క్రీనీడలో జాడ వెతుకుతూ ఆశయాలు,సిద్ధాంతాలకు ఊపిరి పోస్తూ వారి జ్ఞాపకాలతో బరువెక్కిన గుండెలతో బ్రతికేస్తామంటూ అశ్రునివాలులతో,శోకతప్త హృదయాలతో 6 వ వర్ధంతి సందర్భంగా నింగికేగిన తన ఆత్మ శాంతికై శ్రద్ధాంజలి...