subhodayam.news
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 8:21 pm Digital Edition : Jindham Narahari

విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనానికి స్థలం ఇస్తానని హామీ ఇచ్చిన భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ నాగమణి…

భీంగల్ మున్సిపల్ పరిధిలో 6 మండలాలకు చెందిన విశ్రాంత ఉద్యోగుల సమావేశంలో చర్చించుకుని మున్సిపల్ చైర్ పర్సన్ ను మర్యాదపూర్వకంగా కలిసి విశ్రాంత ఉద్యోగులకు సంఘ భవనంలేక పడుతున్న కష్టాలను వివరించి వినతిపత్రాన్ని సమర్పించి,విశ్రాంత ఉద్యోగుల సౌకర్యార్థం భవన నిర్మాణం కొరకు ఖాళీ స్థలాన్ని వెతికి మా సంఘానికి అందజేయాలని కోరారు.మున్సిపల్ చైర్ పర్సన్ నాగమణి మాట్లాడుతూ తహసీల్దార్ తో మాట్లాడి భీంగల్ పట్టణ పరిధిలో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా మీ సంఘ భవన నిర్మాణానికి అందజేస్తానని హామీ ఇచ్చారు.భీంగల్ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ చైర్ పర్సన్ వెంటనే స్పందించి ఇచ్చిన మాటకు రిటైర్ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.