ప్రశాంత్ రెడ్డి పదేపదే ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకోవాలి: ముత్యాల సునీల్ కుమార్

మెండోర డబుల్ బెడ్‌రూమ్ గృహాలను పరిశీలించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ మెండోరా: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మంగళవారం మెండోర మండల కేంద్రంలోని రెండు పడక గదుల గృహ సముదాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2017 మే నెలలో ప్రారంభమైన డబుల్ బెడ్‌రూమ్ గృహాల నిర్మాణం ఇప్పటికీ పూర్తికాకపోవడం దురదృష్టకరమని అన్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఐదేళ్లు మంత్రిగా, అనంతరం మూడేళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ గృహాల నిర్మాణాన్ని పూర్తిచేయించడంలో విఫలమయ్యారని విమర్శించారు. గృహ సముదాయానికి కనీస రహదారులు, సరైన డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక వసతులు కూడా కల్పించలేదని ఆరోపించారు. ప్రజా...