వాల్ పోస్టర్లు ఆవిష్కరణ
బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని జామా మసీదులో మంగళవారం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 6న వర్తమాన కాలంలో విద్య గురించి జరిగే సదస్సుకు సంబంధించిన పోస్టర్లను మర్కస్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మజారుద్దీన్, హఫీజ్ షాయేబ్ ఆవిష్కరించారు. మాజీ కో ఆప్షన్ సభ్యుడు షాహిద్, మర్కస్ కమిటీ ఉపాధ్యక్షుడు రియాజ్, సెక్రటరీ అక్బర్, క్యాషర్ ఇమ్రాన్ ఖాన్, హఫీజ్ మొఖిమ్, హాఫిజ్ అబ్దుల్ రెహమాన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.