సాగునీటి విషయంలో కాంగ్రెస్ సేవలను విస్మరించొద్దు: కొత్తింటి ముత్యం రెడ్డి
ఎల్లంపల్లి–వరద కాలువ–ఎస్‌ఆర్‌ఎస్‌పీ అనుసంధానంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందుతోంది. మెండోరా: నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యం రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులే నేడు వేలాది మంది రైతులకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ముందుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు, వరద కాలువ మరియు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల అనుసంధానం వల్ల ప్రస్తుతం వరద జలాలను ఎస్‌ఆర్‌ఎస్‌పీకి తరలించడం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ...